07-01-2026 12:00:00 AM
వెంకటాపూర్, జనవరి 6 (విజయక్రాంతి): మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొడ్డే పైడయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క తనయుడు సూర్య మంగళవారం నర్సాపూర్ గ్రామానికి చేరుకుని పైడయ్య మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడంతో పాటు పైడయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కుటుంబానికి అన్ని విధా లుగా అండగా ఉంటామని సూర్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బొచ్చు అశోక్, మాజీ సర్పంచ్ పాముకుంట్ల భద్రయ్య, నాయకులు బొచ్చు సమ్మ య్య, చిలువేరు రాజేందర్, మైస భిక్షపతి, యువజన కాంగ్రెస్ నాయకు లు అప్పిడి మహిపాల్ రెడ్డి, నరేష్, తిరుపతి, మేకల రాజేష్, కన్నం మ హేందర్, బండి రమేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.