అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
25-03-2026 12:59 AM
తహసీల్దార్ శ్రీకాంత్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి24: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ అన్నారు. మన ఇసుక-మన వాహనం పథకానికి సంబంధించి తుంగగూడెం మూసీ పరివాహక ప్రాంతం నుండి రవాణా జరుగుతున్న ఇసుక ట్రాక్టర్లను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక పన్ను విధానం కింద ఇసుక ట్రాక్టర్ల ఈ - వే బిల్లులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట గిర్థవార్ జలంధర్ రావు, మైనింగ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




