calender_icon.png 12 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు

12-11-2025 10:01:35 PM

అచ్చంపేట: వాహనదారులు తప్పనిసరిగా నంబర్ ప్లేటు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అచ్చంపేట సీఐ నాగరాజు ఎస్సై సద్దాం హుస్సేన్ సూచించారు. బుధవారం సాయంత్రం అచ్చంపేటలో స్పెషల్ ట్రైన్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని 15 వాహనాలను సీజ్ చేశారు. వారితో కొత్త నెంబర్ ప్లేట్లు తీసుకొచ్చి వాహనాలకు బిగించేలా ఆదేశించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.