03-07-2025 01:04:43 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై2(విజ యక్రాంతి):రైతులకు ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నా రు. బుధవారం వాంకిడి మండల కేంద్రం లోని రాయల్ ట్రేడర్ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా సందర్శించి స్టాకు రిజిస్టర్, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతుల వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
దుకాణంలో ధరల పట్టిక, స్టాకు నిలువల పట్టికను షాపు ముందు ప్రదర్శించాలని తెలిపారు. యూరియా, డి.ఎ.పి., ఇతర మం దులను అధిక ధరలకు విక్రయించినట్లుగా, ఇతర మార్గాల ద్వారా తరలించినట్లుగా, యూరియా కృత్రిమ కొరతను సృష్టించినట్లుగా ఫిర్యాదులు అందినట్లయితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వ్యవసాయ శాఖ అధికారులు మం డలంలోని ప్రతి ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీలు చేయాలని, స్టాక్ నిల్వల వివరాలను ప్రతిరోజు సమర్పించాలని, రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసిల్దార్ కవిత, వ్యవసాయ శాఖ అధికారి గోపీనాథ్, కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.