06-07-2025 02:56:04 PM
తుంగతుర్తి(విజయక్రాంతి): అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప సంఘసంస్కర్త, దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. ఆదివారం తుంగతుర్తిలో జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. కుల రహిత సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో గుండగాని రాములు గౌడ్, గోపగాని రమేష్ గౌడ్, గోపగాని శ్రీను, తడకమళ్ళ రవికుమార్, బొజ్జ సాయికిరణ్, మల్లేష్, వెంకన్న, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.