calender_icon.png 6 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేటుకు దీటుగా సర్కారు వైద్యం

03-07-2025 01:05:07 AM

  1. డిసెంబర్ నాటికి మరో 7 వేల పడకల హాస్పిటల్స్ 
  2. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ  
  3. సీఎంఆర్‌ఎఫ్ కింద దాదాపు రూ.1,500 కోట్లు మంజూరు 
  4. డాక్టర్లు ఏటా నెల రోజులపాటు ప్రభుత్వ దవాఖానలో సేవ చేయాలె 
  5. ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలి
  6. బంజారాహిల్స్ ఏఐజీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే విద్య, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క శ్రద్ధ పెట్టిందని సీఎం తెలిపారు. దీనిలో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరానికి దాదా పు రూ. 3,500 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానల అభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.

కార్పొరేట్ వైద్యానికి ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వరంగంలో కూడా మంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి  చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లో ఏఐజీ హాస్పిటల్‌ను హాస్పిటల్ సీఎండీ నాగేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ జీవీ రావులతో కలిసి సీఎంరేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. దీనిలో భాగంగా గోషామ హల్‌లో 30 ఎకరాల్లో మూడు వేల కోట్లతో 2,700 పడకల ఉస్మానియా హాస్పిటల్ నిర్మా ణం, నిమ్స్‌లో 2,000 పడకలతో నూతన బ్లాక్, వరంగల్‌లో 2,000 పడకల నూతన హాస్పిటల్, అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్‌లో 1000 పడకల హాస్పిటల్స్‌ల నూతన నిర్మాణాలను చేపట్టిం దని తెలిపారు.

ఈ హాస్పిటల్స్ ఈ సంవత్సరం చివరి వరకు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పేదవారి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న రెండు లక్షల బీమాను రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. గడిచిన సంవత్సరంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) కింద దాదాపు రూ.1,500 కోట్ల నిధులను మంజూరు చేశామని పేర్కొన్నారు.

దీనివల్ల పేద ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందని అన్నారు. అలాగే దేశంలోనే మొత్తం బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో హైదరాబాద్ నగరం 35 శాతం ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. గడిచిన కరోనా టైంలో మొత్తం నాలుగు వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మూడు వ్యాక్సిన్లు హైదరాబాద్ నగరం నుంచే వెళ్లడం మన రాష్ట్రానికి గర్వకారణమని వివరించారు.

ఇదంతా గతంలో  ఇందిరాగాంధీ ఐడీపీఎల్‌లో ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రారంభించడం వల్లనే సాధ్యమైం దన్నారు. రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లు అంద రూ సోషల్ రెస్పాన్సిబిలటీ కింద సంవత్సరంలో రాష్ట్రంలో ఎక్కడనైనా ఏటా ఒక నెల రోజులపా టు ప్రభుత్వ హాస్పిటల్స్‌లో తమ సేవలను అం దించాలని కోరారు.

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి భారతరత్న ఇవ్వాలి

ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డిని కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించాలని కేంద్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వం నుంచి   కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు.

25 సంవత్సరాల క్రితం గ్యాస్ట్రో ఎం ట్రాలజీ వైద్యుడిగా పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన నాగేశ్వర్‌రెడ్డి నేడు దాదాపు 66 దేశాల నుంచి వచ్చే పేషెంట్స్‌కు వైద్య సేవలను అందిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ మేరకు ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించిందని తెలిపారు. ఈ అవార్డు దక్కడం అతనికే కాక తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని సీఎ రేవంత్‌రెడ్డి తెలిపారు.