calender_icon.png 7 July, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

03-07-2025 01:02:55 AM

-ఎస్పీ కాంతిలాల్ పాటిల్ 

-ఎన్నికల్లో పట్టుబడ్డ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 2(విజ యక్రాంతి): పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్  అన్నారు. బుధవారం చింతలమానపల్లి, బెజ్జూర్ పోలీస్ స్టేషన్లను సందర్శిం చారు. నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలపై స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధం గా బాధ్యతగా మెలగాలని సూచించారు.

చింతలమానపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ ఎమ్మెల్సీ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో గూడెం శివారులో  పక్కా సమాచారం మేరకు రూ. 21.50 లక్షల విలువచేసే నిల్వచేసిన మద్యం స్వాధీనం పరుచుకున్న బాటలను ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంచుల సమక్షంలో ధ్వం సం చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రామానుజన్, సిఐలు రమేష్, రవి, ఎస్‌ఐ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.