calender_icon.png 7 July, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టపగలు అంజనాపురం ఏరులో ఇసుక అక్రమ రవాణా

06-07-2025 02:59:12 PM

పదికి పైగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న వైనం

పట్టించుకోని కొనిజర్ల రెవెన్యూ అధికారులు

వైరా,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కొనిజర్ల  మండల పరిధిలోని అంజనాపురం ఏర్లో యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది.. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నప్పటికీ కనీసం కొనిజర్ల రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి అనుమతి లేకుండా దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పట్టపగలు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనక2 ఆంతర్యం ఏమిటనే విషయంపై చర్చ జరుగుతుంది. మందులాదిమంది ప్రయాణం చేసే రోడ్డు ప్రక్కనే  వున్న అంజినాపురం ఏరు లో ఎటువంటి భయం బెరుకు లేకుండా చేస్తున్న ఈ అక్రమ రవాణా అధికారులు కను సన్నలోనే జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.. ఎప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 ఇసుక అక్రమ రవాణా విషయం మా దృష్టికి రాలేదు: కొణిజర్ల తహసిల్దార్ అరుణ

 అక్రమ రవాణా విషయంపై విజయక్రాంతి దినపత్రిక ప్రతినిధి ఫోన్లో వివరణ కోరగా  అంజనాపురం ఏరిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్టు తమ దృష్టికి రాలేదని కొనిజర్ల మండల తాసిల్దార్ అరుణ పేర్కొన్నారు.. రవాణా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు