24 July, 2026 | 1:52 AM

నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

24-07-2026 12:48 AM

ఎస్పీ రాజేష్ చంద్ర 

తాడ్వాయి, జూలై, 23( విజయ క్రాంతి ): నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా తాడువాయి పోలీస్ స్టేషన్ లో ఆయన గురువారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నేరాల నియంత్రణ, చేదన పకడ్బందీగా చేయాలన్నారు. సమర్థవంతమైన పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

స్తి నేరాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించి వాటి నిర్వాణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు, సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్, తాడ్వా ఎస్త్స్ర నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.