6 June, 2026 | 1:57 AM

జాతీయ రహదారిపై పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలి

06-06-2026 12:32 AM
  1. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 
  2. సంగారెడ్డిపటాన్చెరు మధ్య రోడ్డు పనుల పరిశీలన

సంగారెడ్డి, జూన్ 5 (విజయక్రాంతి): జాతీయ రహదారి-65పై సంగారెడ్డి నుండి ప టాన్చెరు వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్ట ర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం సంబంధిత శాఖల అధికారుల తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రో డ్డు నిర్మాణ పనులు, వాటర్ లాగింగ్ పా యింట్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల తరలింపు, నీటి పైప్లైన్ల షిఫ్టింగ్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చే శారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు నిర్మాణ పనులు కొనసా గుతున్న నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముం దస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ప్ర మాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్ల వద్ద తాత్కాలిక భద్రతా ఏర్పాట్లు చేయడంతో పా టు, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు చేసి మూసివేయాలని చెప్పారు.

అవసరమైన చోట వాటర్ పైప్లైన్లను వెంటనే షిఫ్ట్ చేయడంతో పాటు ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని జాతీయ రహదారి అధికారులకు సూచించారు. అ లాగే రోడ్డు విస్తరణకు ప్రభావితమవుతున్న నివాస భవనాల యజమానులకు పరిహారం చెల్లించి తొలగింపు ప్రక్రియను త్వ రితగతిన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.

పెద్దాపూర్ పట్నం డా బా ఎదురుగా ఉన్న కల్వర్టును పరిశీలించిన కలెక్టర్, వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా కల్వర్టు వెంట్లను ముందుగానే శుభ్రపరిచి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుం డా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రఘువీర్, ఆర్ అండ్ బీ అధికారులు, జాతీయ రహదారుల డీఈఈ రామకృష్ణ, ఈఈ శ్రవణ్ ప్రకాష్, జీఎం రమేష్, ఆర్కేసీపీఎల్ కాంట్రాక్టర్ జయప్రకాష్, సంగారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.