6 June, 2026 | 1:56 AM

తుమ్మిడిహట్టిపై నోరు మెదపరా?

06-06-2026 12:33 AM

ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మండిపాటు

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి) : బీజేపీని కాపాడుకోవడానకి, తన ఉనికి కోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిప డ్డారు. అన్ని విషయాలపైన మాట్లాడే రాంచందర్‌రావు తుమ్మిడి హట్టి పైన ఎందుకు నోరుమెదపడ టం లేదని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత మీద బ్యారేజ్ నిర్మిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రం గారెడ్డి జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్ట్ కోెసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల ఖర్చు చేసింది. 71 కిలో మీటర్ల కెనాల్ వర్క్ కూడా పూర్తయిందని తెలిపారు. ప్రాణహిత మీద తుమ్మిడిహట్టి బ్యారేజీ ని 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే 100 టీఎంసీల నీళ్లను గ్రావిటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు వాడు కోవచ్చన్నారు.

పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రాప్రాంతానికి బీజేపీ నేతృత్వంలోని కేం ద్ర ప్రభుత్వం అప్పగించిందని ఆయన గుర్తు చేశా రు. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తామని బండి సంజయ్ బడా బడా కబుర్లు చెప్పాడని, ఇప్పుడెందుకు చొరవ చూపించడం లేదని ఆయన నిలదీశారు. తుమ్మిడి హట్టి ప్రాంతాన్ని ఇప్పటికే మా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ పరిశీలించారని, త్వరలోనే సీఎం కూడా పర్యటిస్తారని తెలిపారు. తుమ్మిడిహట్టిని నిర్మిస్తే కాంగ్రెస్ బలపడుతుందన్న ఆందోళనలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఉన్నాయన్నారు.