23 June, 2026 | 11:56 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

గ్రేటర్‌లో సమగ్రాభివృద్ధికి కృషి

11-02-2026 03:26 AM

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ముషీరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): గడిచిన ఐదేళ్లలో గ్రేటర్ లో సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేశామని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీలో రూ .70 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపా ల్, కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, డిప్యూ టీ మేయర్ శ్రీలతరెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏం.అరవింద్ కుమార్ యాదవులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఎస్‌ఈ ఆశాలత, ఈఈ సువర్ణ, డిఈ గీత కుమారి, ఏఈ విశేష్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా ముషీరాబాద్ అభివృద్ధి : ఎమ్మెల్యే ముఠా గోపాల్

రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ముషీరాబాద్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రతి వీధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  ఆధునిక సీసీ రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ, పార్టీ సీనియర్ నాయకుడు టి. సోమన్, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, డివిజన్  నాయకులు డి. శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, పూస గోరఖ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.