అలంపూర్ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కృషి
అలంపూర్, జూన్ 11: అలంపూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.ఈ మేరకు గురువారం కర్నూలు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఎల్‌ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్) సాయాన్ని ఎమ్మెల్యే విజయుడు అందజేశారు. అలంపూర్ మండలం లింగన్వాయి గ్రామానికి చెందిన తిరుపాల్కు శస్త్రచికిత్స నిమిత్తం రూ.5 లక్షల ఎల్‌ఓసి ప్రతిని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. అలాగే ఐజ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కే. పద్మకు ఆపరేషన్ కోసం మంజూరైన రూ.3.40 లక్షల ఎల్‌ఓసి ప్రతిని కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సీఎం సహాయనిది ఎంతో ఉపయోగకరమని అన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.






