ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి
12-06-2026 12:04 AM
కొల్లాపూర్ రూరల్ జూన్ 11: గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి నిరు పేద కుటుంబాన్ని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని బీజేపీ నాయకులు సుధాకర్రావు డిమాండ్ చేశారు. గురువారం కొల్లాపూర్ ఎంపీడీవో వెంకట్రావు కి వినతిపత్రం అందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల పథకాల కింద నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లు కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే ఇళ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. అర్హులను విస్మరిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.






