1 May, 2026 | 1:50 PM

సమస్యల పరిష్కారానికి ఆదివాసీల పోరాట బాట...

09-12-2024 08:20 PM

16న ఐటీడీఏ ముట్టడికి పిలుపు...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదివాసీ తెగల్లోని కొలంల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కొలం సేవ సంఘం అధ్యక్షుడు కొడప సోనేరావు తెలిపారు. ఆదిలాబాద్ లోని అంబేడ్కర్ భవన్ లో సోమవారం సంఘం సభ్యులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ముట్టడి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మేరకు కొడప సోనేరావు మాట్లాడుతూ.. మన్నేవార్లను కొలాం పరిధిలోకి తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మన్నేవార్లకు ఇచ్చిన కొలాం కుల దృవికరణ సర్టిఫికెట్లను రద్దు చేయాలన్నారు. ఐటీడీఏ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 16న చేపట్టి ఐటీడీఏ ముట్టడికి పెద్ద ఎత్తున కొలం తెగ వారు తరలిరావాలని పిలుపునిచ్చారు.