ఇథనాల్ ఫ్యాక్టరీ తొలగించేందుకు పోరాటం

26-04-2024 01:29:02 AM

తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం

సంతకాల సేకరణతో వినతిపత్రం అందించిన రైతులు

ఆదిలాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాం తి): ఇథనాల్ ఫ్యాక్టరీ తొలగించే వరకు చేప ట్టే పోరాటానికి అన్నివిధాల అండగా ఉంటానని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఫ్యాక్ట రీ తొలగించాలని పోరాటం చేసిన అన్నదాతలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టడం అమానుషమని పేర్కొన్నారు. నిర్మ ల్ జిల్లా దిలావర్‌పూర్‌లో గురువారం ఉపా ధి హామీ కూలీలను కలిసి ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి చర్చించారు.  ఈ సందర్భంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రభావంపై సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రం రైతులు కోదండరాంకు అందజేశారు. అనంతరం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో తమ పంటలు నాషనమవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభమైతే చుట్టుపక్కల గ్రామాలకు ముప్పు పొం చి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎలాం టి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీ నిర్మిచడం సరికాదని, ఫ్యాక్టరీ పూర్తిగా తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్దె అక్షరఅనిల్, నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సాగర్ రెడ్డి, రమణ, కుంట గంగారెడ్డి, రవి, కోడె శ్రీనివాస్,  కోడె నవీన్, బెల్లాజి రాజు, కోడె విజయ్, తెలంగాణ జేఏసీ సభ్యులు రైతులు పాల్గొన్నారు.