28-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 27 (విజయక్రాంతి): నిర్మ ల్ పట్టణంలోని రాంనగర్ దుర్గామాత ఆలయంలో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని నెలరోజుల పాటు నిర్వహించే కార్య క్రమంలో భాగంగా ఎమ్మెల్యే అమ్మవారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీలోకి తాజా మాజీ సర్పంచ్
సారంగపూర్ మండలం మహావీర్ తండా కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ పవార్ రవీందర్ బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో శుక్రవారం చేరా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, నాయకులు సత్యనారాయ ణ గౌడ్, మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.