calender_icon.png 22 August, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగతలో మునిగి విద్యార్థి మృతి

24-07-2024 12:03:48 AM

జయశంకర్ భూపాలపల్లి, జూలై 23 (విజయక్రాంతి): బొగత జలపాతంలో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలో నివాసముంటు న్న జశ్వంత్ (19) మిత్రులతో కలిసి బొగతకు వచ్చాడు. స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు నీటిలో దిగి గల్లంతయ్యాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విద్యార్థి ఆచూకీ కోసం గాలించగా, మృతదేహం లభ్యమైంది. జశ్వంత్ వరంగల్‌వాగ్దేవీ కాలేజ్‌లో బీటెక్ చదువుతున్నాడు.