1 August, 2026 | 1:01 AM

విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి

01-08-2026 12:00 AM

హయత్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట బీసీ ప్రజా సమితి ఆందోళన

ఎల్బీనగర్, జులై 31 : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు హయత్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట  శుక్రవారం బీసీ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి భీమ్ రాజ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులతో ధర్నా, ఆందోళన చేపట్టారు.

ముందుగా  బీ సీ  సంఘం నాయకులు విద్యార్థులతో కలిసి భారీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం హ యత్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదు ట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బానాల అజయ్ కుమార్, బీసీ సంక్షేమ సం ఘం ప్రధాన కార్యదర్శి ఎత్తరి భీమ్ రాజ్ - బీసీ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు  మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయి లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సుమా రు 14 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్ మెంట్ రాకపోవడంతో ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు 8 వేల కోట్ల ఫీజు రీయిం బర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభు త్వం చెలగాటం ఆడకుండా పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు.

ఫీజుల బకాయిలు అందక కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, విద్యావేత్తలు మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు. బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసన ధర్నాలు చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.