calender_icon.png 1 August, 2025 | 2:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల కష్టపడి చదువుతూ లక్ష్యం వైపు పయనించాలి

31-07-2025 06:21:10 PM

యువ వికాస్ కోఆర్డినేటర్ పూర్ణ శశికాంత్

తుంగతుర్తి,(విజయక్రాంతి): విద్యార్థుల పాఠశాలలో క్రమశిక్షణతో చదువుతూ లక్ష్యం వైపు పయనించినప్పుడే ఉన్నతమైన ఉద్యోగాలు పొందుతారని యువ వికాస్ కోఆర్డినేటర్ పూర్ణ శశికాంత్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల బాలుర పాఠశాలలో తుంగతుర్తి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పాఠశాలలో క్రమశిక్షణతో మెలిగి, కష్టపడి చదివి, తను ఎంచుకున్న లక్ష్యం వైపు పయనించారని కోరారు. విద్యార్థుల చదువు కోసం తమ తల్లిదండ్రు పడే కష్టాలను, గొప్పగా పాటను తెలియపరచి, జరిగిన సంఘటనలు గొప్పగా వర్ణించారు.

ప్రతి విద్యార్థి పదవ తరగతి పరీక్షల్లో 95 శాతం ఉత్తీర్ణత సాధిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం లైన్స్ క్లబ్ సభ్యులు కోఆర్డినేటర్ లక్ష్మీకాంతను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, పి ఈ టి యాకయ్య లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట లైన్స్ క్లబ్ జెడ్ సి లక్ష్మారెడ్డి ఆర్ సి సంతోష్ తుంగతుర్తి లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి కోశాధికారి గుండ గాని రాము, ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ఓరుగంటి శ్రీనివాస్, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, యాదగిరి గౌడ్,, గుమ్మడవెల్లి సోమన్న, ఓరుగంటి సుభాష్, వంగాల వెంకన్న, విద్యార్థులు పాల్గొన్నారు.