ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
మహబూబాబాద్,(విజయక్రాంతి): విద్యార్థి సియా ఉలేరియాను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో కాలేజీకి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నాయకురాలు సియా ఉలేరియాపై గంజాయి మత్తులో ఉన్న దుండగులు హత్యకు పాల్పడ్డారని, హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా గంధసిరి జ్యోతిబసు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యాలు మద్యం, గంజాయి లాంటి చెడు వ్యసనాలపై ఉక్కు పాదం మోపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండ్ల రాకేష్ నాయకులు వరుణ్, వంశీ, నరసింహ, సందీప్, మధు,సంధ్య, రేష్మ, జాస్మిన్, మానస, మౌనిక, నర్మదా తదితరులు పాల్గొన్నారు.






