calender_icon.png 12 August, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బాలో కనీస సౌకర్యాలు ఏవి..?

12-08-2025 03:56:25 PM

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... 

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 

నకిరేకల్,(విజయక్రాంతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాలను మంగళవారం  ఆయన సందర్శించి. విద్యార్థులతో కలిసి మాట్లాడి సమస్యలను అడిగితెలుసుకున్నారు. తాగునీరు, వసతి గృహాలు, మరుగుదొడ్లు, భోజన సదుపాయాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు తగిన స్థాయిలో లేవని విద్యార్థులు తమ సమస్యలను ఆయనకు వివరించారు.

గదులకు కిటికీలు లేకపోవడం, టాయిలెట్లకు తలుపులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయనతెలిపారు. సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం అందించడం, అన్నంలో నీళ్లు ఎక్కువగా ఉండటం వలన తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీనవర్గాల విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆయన విమర్శించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అయివిద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసారని ఆరోపించారు.

సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో గురుకులాలునిర్వీర్యమవుతున్నాయని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో కస్తూర్బా గురుకులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసిందని ఆయనతెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి గురుకులాల కస్తూరిబా పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించి విద్యార్థులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు మాజీ జెడ్పిటిసి తలారి బలరాం, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.