12-08-2025 03:50:43 PM
భయం గుప్పెట్లో న్యాయవాదులు
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): కురిసిన వర్షాల కారణంగా జిల్లా కేంద్రంలోని సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద స్లాబ్ మంగళవారం పేచ్చులు ఊడి పడ్డాయి. ఆ సమయంలో పెచ్చులు ఊడి పడినప్పుడు ప్రమాదవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామని అడ్వకేట్లు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాల కారణాలవల్ల కోర్టు ఆవరణలో ఏ క్షణాన ఏమవుతుందో అని న్యాయవాదులు భయపడుతున్నారు.