17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జర్నలిస్టుల కోసం వెల్‌నెస్ ఆసుపత్రి హెల్త్ కార్డు

07-01-2026 12:00 AM

హెల్త్ కార్డు జారితో జర్నలిస్టులకు ఆరోగ్యానికి పూర్తి భరోసా..

ఆనందాన్ని వ్యక్తం చేసిన జర్నలిస్టులు..

నిజామాబాద్ జనవరి 6 (విజయ క్రాంతి): జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యులు పూర్తి భరోసా ఇస్తూ హెల్త్ కార్డు జారీ చేస్తామనడం చాలా గొప్ప విషయమని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి  శ్రీకాంత్, డాక్టర్ వాగ్మారే సుభాష్ అన్నారు. మంగళవారం నగరంలోని వెల్నెస్ ఆస్పత్రి యాజమాన్యం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్  అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ఆధునిక హంగులతో, అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వెల్నెస్ ఆస్పత్రి యజమాన్యులు ముందుకు రావడం జర్నలిస్ట్ మిత్రులందరికీ మంచి శుభ పరిణామం అని అన్నారు.

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని భరోసా ఇస్తున్నామన్నారు. అనంతరం జర్నలిస్ట్ మిత్రుల కోసం వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యులు ఉచిత హెల్త్ కార్డు అందజేస్తున్నందుకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల తో పాటు జర్నలిస్ట్ పక్షాన వెల్నెస్ ఆస్పత్రి డైరెక్టర్లు, అసద్ ఖాన్, సుమన్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ఆంజనేయులు, సతీష్ గౌడ్, జెట్టి గోవిందరాజు, సందీప్ దేశ్ముఖ్, నరేందర్ స్వామి, ఈసీ సభ్యులు సితారే కృష్ణ, పొద్దుటూరు ప్రీతం రెడ్డి,  సీనియర్ జర్నలిస్టులు పాపా ఖాన్, నయీమ్ కమర్ బాయ్, మహమ్మద్ గౌస్ బాయ్, వెల్నెస్ ఆస్పత్రి మేనేజర్ వినోద్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.