calender_icon.png 1 August, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడవకురా బుజ్జి.. నేనున్నాగా

31-07-2025 07:05:29 PM

చిన్నపిల్లల పట్ల మమకారం చూపెడుతున్న కలెక్టర్

నిర్మల్,(విజయక్రాంతి): పరిపాలన సమావేశంలో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిల్లలపై ప్రేమను చూపుతూ ఎక్కడ ఉన్నా వారి వద్ద నుంచి తన ఒడిలోకి తీర్చుకొని బుజ్జికన్నా ఏడవకురా అంటూ పిల్లలను పలకరిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి సమస్యలు ఓపికగా విని వారి పిల్లలను ఆప్యాయంగా దగ్గర తీసుకొని క్యూట్ బేబీ స్మార్ట్ బేబీ వెరీ నైస్ అంటూ జిల్లా కలెక్టర్ పాప తల్లిని పలకరిస్తూ ఆసక్తిని చూపుతున్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో తల్లి మాట్లాడుతుండగా పాప అల్లరి చేయడంతో అక్కడే ఉన్న కలెక్టర్ ఆ పాపను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించారు పిల్లలపై ఉన్న ప్రేమను మరోసారి చాటిచెప్పారు