17 June, 2026 | 11:33 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

13-07-2024 11:00 AM

వరంగల్: హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేయూలోని రాణిరుద్రమదేవి హాస్టల్ ను రిజిస్ట్రార్ మల్లారెడ్డి పరిశీలించారు. హాస్టల్ కు వచ్చిన కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు అడ్డుకున్నారు. నిన్న కేయూ హాస్టల్ లోని ఓ గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. పెచ్చులు పడినప్పుడు విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని విద్యార్థులు వెల్లడించారు. హాస్టళ్లను ఎవరూ పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ గో బ్యాక్ అంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. కేయూ రిజిస్ట్రార్ తో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు.