26 March, 2026 | 2:50 AM

ప్రజాస్వామ్యం, శాసనం మీద విద్యార్థులకు అవగాహన కల్పించాలి

26-03-2026 12:00 AM

శాసనసభను సందర్శించిన అల్వాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 

మేడ్చల్, మార్చ్ 25 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యం, శాసనం మీద విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అసెంబ్లీకి తీసుకెళ్లారు. విద్యార్థులకు వివిధ అంశాలపై ఆయ న వివరించారు. ఇటీవల అల్వాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగు తాయి, ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారు.

ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి అనే అం శాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి అసెంబ్లీకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో బుధవారం దొడ్డి అల్వాల్ సుభాష్ నగర్ పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులను అసెంబ్లీకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఎమ్మెల్యే అసెంబ్లీ గ్యాలరీకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి విద్యార్థులు అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించారు. విద్యార్థుల వెంట ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు రేణుకా దేవి, వసుమతి, శారద తదితరులున్నారు.