విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు
22-04-2026 12:00 AM
తాడ్వాయి, ఏప్రిల్, 21 (విజయక్రాంతి): విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావద్దని ప్రముఖ సైకియాట్రిస్ట్ రమణ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రజాపాలన,ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ఎల్లప్పుడూ మానసికోల్లాసంతో ఉండాలన్నారు. మాదకద్రవ్యాలను వాడకూడదని తెలిపారు. వాటికి పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. ఆరవ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, సైకియాట్రిస్ట్ రాహుల్, దోమకొండ ఎస్త్స్ర దీపిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






