22 April, 2026 | 1:34 AM

వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలి

22-04-2026 12:00 AM

రాష్ట్ర సివిల్ సప్లు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

కామారెడ్డి, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. కామారెడ్డి మండలం గరుగుల్లో వరిధాన్యం కొనుగోలు సెంటర్, గోకుల్‌తండాలో ధాన్యం సెంటర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా రవీంద్ర రైతులతో మాట్లాడారు. వరి కొనుగోలులో భాగంగా పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు.

కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రైతులకు చెల్లింపులు త్వరగా జరిపేందుకు పీఎంఎంఎస్ టాబ్లెట్లలో నమోదులను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 353 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా సివిల్ సప్లై అధికారి, డీఎం, డీఆర్డీఏ పీడీ సురేందర్, జిల్లా కో అధికారి, డీఎల్‌ఎంవో, మార్కెటింగ్ ఏడీ, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.