calender_icon.png 31 July, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి

29-07-2025 12:31:10 AM

  1. సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ 

మల్కాజిగిరి ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ

మేడ్చల్, జూలై 28 (విజయ క్రాంతి): సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని 24 గంటలు ఆస్పత్రిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సెర్ప్ సిఈఓ, జిల్లా స్పెషల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టరు రాధికగుప్తా తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సిఈఓ మాట్లాడుతూ నార్మల్ డెలివరీస్ ని ప్రోత్సహించాలని, ఓపి సేవలు పెంచాలని, టీబీ ముక్త్ భారత్ లో భాగంగా స్క్రీనింగ్, ఎక్స్ రే సేవలు అందించాలన్నారు.

ఈ డి డి కేసులను ఫాలోఅప్ చేయాల ని, ఫీవర్ క్యాంప్స్ పెంచాలని, డెంగ్యు కేసులు నివారించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. చిన్న పిల్లలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవలన్నారు. ఆసుపత్రులలోని జెరియాట్రిక్ వార్డు (వృద్ధుల చికిత్స విభాగం), జిల్లా కేన్సర్ సెంటర్, పిడియాట్రిక్ వార్డు (శిశువైద్య విభాగం), ఔట్ పేషెంట్ వార్డు తదితర విభాగాలను పరిశీలించారు.

దివ్యాంగులకు అందుతున్న చికిత్సను సమీక్షించి, వారికి అందుతున్న వైద్య స దుపాయాలపై వివరంగా విచారణ చేశారు. ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు, శస్త్రచికిత్సల (ఆపరేషన్ల) సంఖ్యపై వైద్యుల వద్ద నుండి వివరాలు సేకరించారు. ఫార్మసీలో ఉన్న మందుల నిల్వలు, వాటి సరఫరా, ఈ-ఔషధి పోర్టల్ పనితీరు గురించి సమీక్షించారు.

అలాగే ఏ బి హెచ్ ఏ కార్డుల పంపిణీ, ల్యాబ్ సదుపాయాల కింద తీసుకున్న శాంపిళ్ల వివరాలు, క్షయవ్యాధి రోగుల చికిత్సకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై కూడా వివరంగా విచారణ చేశారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ ఉమాగౌరీ, సంబంధిత మెడికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.