calender_icon.png 19 December, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

19-12-2025 01:31:56 AM

యువతే మాదకద్రవ్య రహిత తెలంగాణభారతదేశ నిర్మాణానికి కీలకం : డీఎస్పీ సైదులు

మొయినాబాద్ డిసెంబర్ 18(విజయ క్రాంతి): విద్యార్థులు మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, యువతే మాదకద్రవ్య రహిత తెలంగాణ, భారతదేశ నిర్మాణానికి కీలక పాత్ర పోషించాలని టీజీ ఏఎన్బీ (తెలంగాణ రాష్ట్ర ఆంటి నార్కోటిక్ బ్యూరో) డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అధికారి సైదులు అన్నారు. మండల పరిధిలోని అజిత్నగర్ సమీపంలో ఉన్న కేఎల్హెచ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎన్‌ఎస్‌ఎస్, తెలంగాణ ప్రభుత్వ ఆంటి నార్కోటిక్ బ్యూరో, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ సైదులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్, మత్తు పదార్థాల వ్యసనం, హబ్ కల్చర్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని హెచ్చరించారు. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుందని, ఏవైనా కేసులు నమోదైతే ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.

మాదకద్రవ్య దుర్వినియోగం వల్ల యువత విలువైన జీవితాలను కోల్పోతున్నారని, దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్, హింసాత్మక నేరాలు, పాఠశాలలుకళాశాలలు మానేయడం వంటి సామాజిక సమ స్యలు పెరుగుతున్నాయన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని అన్నారు.

మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని కోరారు. అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఎం.పి. మల్లేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. చంద్రశేఖర్, ఫ్యాకల్టీ ఇన్చార్జీలు డాక్టర్ వెంకటరాజు, డాక్టర్ భవాని, డాక్టర్ దీప్తి, విద్యార్థి వాలంటీర్లు మోహన్, వైష్ణవి, రోహిత్  పాల్గొన్నారు.