31 July, 2026 | 1:10 AM

ప్రముఖుల జీవితాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

31-07-2026 12:00 AM

ముషీరాబాద్ విద్యామండలి డిప్యూటీ ఈవో లక్ష్మణ్ సింగ్

ముషీరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ప్రముఖుల జీవితాలను ఆదర్శంగా తీసుకోని విద్యార్థులు బాగా చదువుకోవాలని ముషీరాబాద్ విద్యామండలి డిప్యూటీ ఈవో లక్ష్మణ్ సింగ్ సూచించారు. గురువారం ముషీరాబాద్ డివిజన్ లోని ఎంసీహెచ్ స్పోరట్స్ కాంప్లెక్స్ లో హైదరాబాద్ జిందాబాద్ కమిటీ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు ఉపణ్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతూ అనేక మంది ప్రముఖులు సాధించిన విజయాలపై విద్యార్థులు దృష్టిసారించాలని, వారిని ఆదర్శంగా తీసుకోవలన్నారు.

పిల్లలు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, భవిష్యత్ భారతం లాంటి అంశాంలో పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ కమిటీ అధ్యక్షుడు వీరయ్య, కాలనీవాసులు శ్రీవల్లీ, శ్రీనివాస్ రావు, వెంకటేష్, హైదరాబాద్ జిందాబాద్ నగర కమిటీ నాయకులు రాజమౌళి, రఘు, వెంకటేష్ పాల్గొన్నారు.