అనుమానాస్పదంగా విద్యార్థిని ఆత్మహత్య
- తోటి విద్యార్థి ఇంస్టాగ్రామ్, వాట్సాప్ చాటింగ్‌పై పలు అనుమానాలు
- హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- కేసు నమోదు చేసిన పోలీసులు
- కాంగ్రెస్ ఎస్సీ సెల్ మాజీ నేత కుమారుడుపై అనుమానాలు?
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): విద్యార్థిని అనుమానస్పద మృతిచెందిన సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు డివిజన్ కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న రితిక(15) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ నాగరాజు గౌడ్ వదిన వివరాల ప్రకారం& గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ వెంకటేశ్వర్లు కుమార్తె రితిక లయోలా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
ఆమె సహ విద్యార్థి బర్రెల రాజ్కుమార్ కుమారుడు వినయ్(15) కొంతకాలంగా ఇన్స్టాగ్రా మ్, వాట్సాప్ ద్వారా ఆమెతో చాటింగ్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 9న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రితిక తన ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు తండ్రి కేశవ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
సాయంత్రం ఇంటికి చేరుకున్న కేశవ్ తన కుమార్తె మృతదేహాన్ని గుర్తించాడు. అనంతరం ఎవరికి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసుల సూచనల మేరకు ఫిర్యాదు నమోదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా దవాఖన తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, రితిక ఆత్మహత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ మాజీ నేత కుమారుడుపై అనుమానాలు?
రితిక ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రాస్తుండగా రెండు పరీక్షల రాసి మిగతావి రాయనట్లుగా తెలుస్తుంది. వినయ్ ప్రేమ వేధింపులే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.




