11 April, 2026 | 4:12 AM

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం బాన్సువాడ డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక

11-04-2026 02:09 AM

బిచ్కుంద, ఏప్రిల్ 10(విజయక్రాంతి); కామారెడ్డి జిల్లా  బిచ్కుంద మండల కేంద్రంలో బాన్సువాడ డివిజన్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉల్లెంగ బాలరాజు ఆధ్వర్యంలో ఎంపిక అయినట్లు ఒక ప్రకటన లో తెలిపారు.

వారు వెల్లడించిన వివరాల ప్రకారం బాన్సువాడ డివిజన్ అధ్యక్షులుగా శంక్రే అనిల్(బిచ్కుంద) ఉపాధ్యక్షులుగా మంగలి సతీష్ (అంజనీ తండా) ప్రదాన కార్యదర్శిగా రాజశేఖర్ (చావని తండా)సహా కార్యదర్శులుగా వాజిద్ హుస్సేన్ (బిచ్కుంద) వసిమ (అంజనీ తండా) నగేష్ (బిచ్కుంద) మహేశ్ (అంజనీ తండా) కోశాధికారిగా దేశ్ముక్ మాధవ్ (బిచ్కుంద) మహిళా విభాగ కార్యదర్శిగా రేణుకా (బిచ్కుంద) సలహాదారులుగా దత్తా గౌడ్(బిచ్కుంద) గంగాధర్ (చావని తండా)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ డీఈఓ పోస్టులను పీజీ ప్రధానోపాధ్యాయులతోను ఎంఈవో పోస్టులను ప్రభుత్వ ఉపాధ్యాయుల తోను సీనియారిటీ  మేర రెగ్యులర్ పోస్టుల ద్వారా భర్తీ చేయాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు వై రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కామారెడ్డి జిల్లా మహిళా కార్యదర్శి శిరీష, తదితరులు పాల్గొన్నారు.