17 July, 2026 | 4:27 AM

స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి

08-06-2026 05:06 PM

నిర్మల్,( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర జోన్ పరిధిలోని నిరుద్యోగ యువత కోసం ఉచిత ప్రభుత్వ ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నిర్మల్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు, మరియు ఆ శాఖ అధికారి దయానందుకు వినతిపత్రం అందజేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. బాసర జోన్ పరిధిలో సుమారు 50 వేల మందికి పైగా నిరుద్యోగ యువత ఉన్నారని,

వారిలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులేనని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది కోచింగ్‌కు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ శ్రీనివాస్ రాజన్న సాదిక్ తదితరులు ఉన్నారు.