26 July, 2026 | 5:47 AM

అప్పాయిగూడెంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక గ్రామ సభ

08-06-2026 05:04 PM

కారేపల్లి,(విజయక్రాంతి): అప్పాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా అప్పాయిగూడెం రైతు వేదికలో స్థానిక సర్పంచ్ దండు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఇంచార్జ్ ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని  ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారం, వ్యవసాయాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, విద్య, ఆరోగ్య సేవల మెరుగుదలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై గ్రామస్తులతో విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజల నుంచి సమస్యలు, అవసరాలు, సూచనలను స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.