15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కష్టపడి చదవండి.... నగదు బహుమతి పొందండి

29-01-2026 04:25 PM

మండల విద్యాధికారి బోయిన లింగయ్య 

తుంగతుర్తి (విజయ క్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోనిజిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ టెన్త్ క్లాస్ కరపత్రాన్ని తుంగతుర్తి మండల విద్యాధికారి బోయిని లింగయ్య గురువారం ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి చదువుపై మరింత శ్రద్ధ పెరిగేలా ప్రోత్సహించి వారు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా మార్గనిర్దేశం చేసే గొప్ప కార్యక్రమాన్ని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తలపెట్టిందని విద్యార్థుల పట్ల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తలపెట్టిన గొప్ప యజ్ఞం విద్యార్థులు బాగా చదివి రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రధమ ద్వితీయ విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతిని ప్రోత్సహకంగా అందివ్వడం జరుగుతుందన్నారు.

రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని పొందిన వారికి ఐదు లక్షల రూపాయల నగదు, రెండవ స్థానం పొందిన వారికి 3 లక్షల నగదు, జిల్లా టాపర్ గా  నిలిచిన వారికి 2 లక్షల నగదు, నియోజకవర్గస్థాయిలో టాపర్ గా నిలిచిన వారికి ఒక లక్ష బహుమతిని మండల స్థాయిలో టాపర్ గా నిలిచిన వారికి పదివేల నగదు బహుమతిని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున అందివనున్నారని తెలియజేశారు కావున మండల పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులందరూ వినియోగించుకోవాలన్నారు ఈ మంచి సదవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలో 2026 మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందని తెలియజేశారు.

విద్యార్థులు కేవలం నగదు కోసమే కాకుండా తమ తల్లిదండ్రుల ఆశయాలను, ఉపాధ్యాయుల లక్ష్యాలను, ఆలోచనలను, సూచనలను పాటిస్తూ ఉన్నత  మార్కులు పొందే దిశగా విద్యార్థులంతా తమ తమ లక్ష్యాలను నిర్దోషించుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి కుటుంబానికి జీవిత బీమా తప్పనిసరి అని బీమా చేసిన ప్రతి వ్యక్తి ధీమాగా ఉంటారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ బందెల భరత్ కుమార్, తుంగతుర్తి మండల ఎగ్జిక్యూటివ్  గంట మహేందర్, తుంగతుర్తి డెవలప్మెంట్ ఆఫీసర్ తొట్ల మంజుల సుధాకర్, సేల్స్ ఆఫీసర్స్ చిర్ర నరేష్, గోపగాని లింగమూర్తి, బింగి వెంకటేశ్వర్లు, పులుసు కల్పన సుధాకర్, పొదల వీరన్న, గుండ గాని లింగయ్య , తుంగతుర్తి మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.