29-01-2026 04:23:35 PM
సీఐ బాలాజీ వరప్రసాద్
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి):మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను సీఐ బాలాజీ వరప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలు, ఎన్నికల నిబంధనల అమలును పర్యవేక్షించి సంబంధిత రికార్డులను పరిశీలించారు. నగదు, మద్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.