calender_icon.png 29 January, 2026 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ్ అనే పేరున్నందుకే 'వి.బి.జి. రామ్ జీ' చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్

29-01-2026 04:27:27 PM

మానకొండూర్,(విజయక్రాంతి): రామ్ అనే పేరున్నందుకే 'వి.బి.జి. రామ్ జీ' చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అన్నారు. గురువారం గన్నేరువరం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, కూలీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'వికసిత భారత్ గ్యారెంటీ రామ్ జీ - 2025' చట్టాన్ని కేవలం అందులో 'రామ్' అనే పేరున్నందుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం ఆ పార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ఏ మంచి పని చేపట్టినా అడ్డుపడటమే కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందని  విమర్శించారు. కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చేసిన విబిజి రాంజీ వ్యతిరేక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాఫెల్ యుద్ధ విమానాలు, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, స్వచ్ఛ భారత్, వందే భారత్ రైళ్లు, నూతన న్యాయ సంహిత వంటి చారిత్రాత్మక నిర్ణయాలను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం చేసినా ఆ పార్టీ తీరు మారలేదని ఎద్దేవా చేశారు. కూలీల కడుపు కొట్టేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బండి తిరుపతి, పుల్లెల రామ్, మునుగంటి సత్తయ్య, కాంతల రాజిరెడ్డి, మాడుగుల రామకృష్ణారెడ్డి, గూడూరి జగన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.