18-01-2026 06:42:05 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బేబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు వారికి సూర్య తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యావేత్త సుభాష్ రెడ్డి ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని కల్పించారు. ఇటీవల కన్ను ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఇస్తాను తీసుకుంటున్న బీంపేట గ్రామానికి చెందిన సుభాష్ రెడ్డి కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవునిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనారోగ్యం తో ఉన్నారని తెలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు.
లింగుపల్లి గ్రామానికి చెందిన బిక్నూర్ తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పర్దిపెట్ గ్రామానికి చెందిన వెంకట్ రాజ్ గౌడ్ తండ్రి మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి సుభాష్ రెడ్డి తో పాటు నరసాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి లు పరామర్శించారు. సుభాష్ రెడ్డి తో పాటు అనుచరులు జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బీబిపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కప్పెర రవీందర్ రెడ్డి, తూజాల్పూర్ మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్, బి బి పెట్, జనగామ గ్రామాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.