01-09-2025 12:54:01 AM
వేములవాడ టౌన్, ఆగస్టు 31(విజయ క్రాంతి)ఆదివారం నాడు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల వేములవాడలో నాలుగు మోకాలు మార్పిడి ఆపరేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పటివరకు 48 మోకాలు మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. వేములవాడ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆపరేషన్ల కోసం వేములవాడకు వస్తున్నారు. ఇంకా దాదాపు వంద మంది దాకా ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
ఇకనుండి క్రమం తప్పకుండా ప్రతివారం మోకాలు మార్పిడి ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. విప్ వేములవాడ ఎమ్మెల్యేఆది శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ అధికారులతో సంప్రదించి ఈ ఆపరేషన్లు అవ్వడానికి విశేష కృషి చేశారు. ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాము. సిటీ స్కాను ను కూడా పునరుద్దింప చేసాము.
ప్రస్తుతం సిటీ స్కాన్ సేవలు, అల్ట్రా సౌండ్స్ సేవలు, ఎక్స్ రే సేవలు, అన్ని రకాల రక్త పరీక్షలు, కంటి ఆపరేషన్లు, సాధారణ శస్త్ర చికిత్సలు, గర్భిణీలకు సాధారణ కాన్పులు, ఆపరేషన్ లు, గర్భసంచి ఆపరేషన్లు, ఆర్థోపెడిక్ ఆపరేషన్లు మరియు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాము. ఇట్టి సదుపాయాలను. జిల్లా ప్రజలు సద్వినియోగ పర్చుకోవాలని కోరుకుంటున్నాము.