07-09-2025 02:47:44 PM
దేవరకొండ: దేవరకొండ పట్టణ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధుదు,మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికిసిపిఐ శ్రేణులు పులమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి దేప సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భూమికోసం,భుక్తికోసం,వెట్టిచాకిరి విముక్తికోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో రావిరెడ్డి అగ్రభాగాన ఉండి పోరాటం నిర్వహించాడన్నారు.వారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని,వారి జీవితాన్ని ఆదర్శంగాతీసుకోవాలన్నారు.ఈకార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి వలమల్ల ఆంజనేయులు,మండల కార్యవర్గ సభ్యులు పల్లా రంగారెడ్డి, జూలూరి వెంకట్రాములు,ఎండి మైనొద్దీన్, పట్టణ శాఖ కార్యదర్శులు లింగంపల్లి వెంకటయ్య,కందుకూరి శ్రీను,జూలూరి జ్యోతిబస్ నాయకులు గంగలి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.