01-09-2025 12:54:53 AM
రాష్ట్ర సేవాదళ్ సలహాదారులు సుభాష్ ఖత్రి
మహబూబ్ నగర్ టౌన్ ఆగస్టు 31 : కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ విభాగానికి ప్రత్యేక స్థానం ఉందని రాష్ట్ర సేవాదళ్ విభాగం సలహాదారులు సుభాష్ ఖత్రి అన్నారు. చివరి ఆదివారం సందర్భంగా పట్టణంలోని రాజు గృహకల్పలో సుభాష్ ఖత్రి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజగౌని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేశారు.
సుభాష్ ఖత్రి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలతోపాటు సేవా కార్యక్రమాల్లో సేవాదళ్ విభాగం ముందుండి పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సేవాదలకు ఘనమైన చరిత్ర ఉందని అన్నారు. జిల్లాలో సేవాదళ్ ను మరింతగా బలోపేతం చేయాలని కోరారు. ప్రతి నెల చివరి ఆదివారం సేవాదళ్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమలో రామ్ చందర్, ఎండి షరీఫ్, ప్రభాకర్, సేవాదళ్ అసెంబ్లీ ఇన్చార్జి జగదీష్, పట్టణ అధ్యక్షులు అలీ, దేవరకద్ర అసెంబ్లీ ఇన్చార్జీ వేణుకుమార్, నాయకులు అశోక్, వెంకటలక్ష్మి, యూసుఫ్, శ్రీరాములు, లోక్ నాథ్, దేవన్న, నారాయణ, మమ్మద్ ఖాదర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.