calender_icon.png 8 September, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్రలేఖనంలో ఊహలకి రూపం ఇచ్చిన విద్యార్థులు

01-09-2025 12:53:32 AM

మహబూబ్ నగర్ టౌన్ ఆగస్టు 31: స్ఫూర్తి సామాజిక సేవ యువజన కళా సంస్థ ఆధ్వర్యంలో న్యూ టౌన్ లోని సీతారామాంజనేయ గ్రంథాలయంలో ఆదివారం’ నా ఊహల్లో గణేశుడి రూపం’ అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో మొదటి విభాగంలో: లాస్య ప్రథమ, తన్మై ద్వితీయ, యోజిత్ తృతీయ, సాయి అద్వైత్ ప్రోత్సాహక బహుమతులు.

రెండవ విభాగంలో: భావిక్ ప్రథమ, అభిలాష్ ద్వితీయ, సిద్ధార్థ్ ఆర్యన్ తృతీయ, ఆరాధ్య ప్రోత్సాహక బహుమతులు. మూడో విభాగంలో: జయలక్ష్మి ప్రథమ, అంజలి ద్వితీయ బహుమతులను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు ప్రముఖ జాతీయవాద కవి రంగినేని మన్మోహన్,పాలమూరు యువకవుల వేధిక అధ్యక్షుడు బోల యాదయ్య, ఎఎన్ గౌడ్ చేతుల మీదుగా అందుకున్నారు.

రంగినేని మన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటుగా క్రీడలు,కళలను నేర్చుకోవాలని , మొబైల్ కి అలవాటు పడితే వ్యసనంగా మారి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. బోల యాదయ్య మాట్లాడుతూ చిత్రకళలో పాల్గొన్న విద్యార్థులు చిన్న వయస్సులోనే తమ ఊహలకు అపురూపమైన నైపుణ్యాన్ని తమ చిత్రాలలో చూపించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు చక్కని పాటలు పాడి తమ ప్రతిభను చాటారు. చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు స్ఫూర్తి సంస్థ సభ్యులు ఎఎన్ గౌడ్, జేపీ మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి విద్యార్థులు పాల్గొన్నారు.