12 June, 2026 | 1:31 PM

Breaking News

మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •  

ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన సుడా చైర్మన్

30-10-2025 12:00 AM

లెక్చరర్లకు తగు సూచనలు చేసి విద్యార్థినులకు భరోసా 

 ముకరంపురా, అక్టోబర్29(విజయక్రాంతి); గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన దృష్ట్యా కరీంనగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి లెక్చరర్లకు సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించి విద్యార్థినులకు భరోసా కల్పించారు.కళాశాలలో వసతులపై ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సాయంత్రం విద్యార్థినులు ఇంటికి వెళ్లే సమయంలో మెయిన్ గేటు వద్ద ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు సుడా చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు పోలీసులు మెయిన్ గేటు వద్ద పర్యవేక్షణ చేసి విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.డిఈవో గంగాధర్,ప్రిన్సిపాల్ నిర్మల, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్,లెక్చరర్లు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.