calender_icon.png 23 July, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన సుడా చైర్మన్

23-07-2025 12:00:00 AM

కొత్తపల్లి, జూలై22(విజయక్రాంతి): అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.సుడా కార్యాలయంలో లబ్ధి దారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు అం దజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు వివిధ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధిచేకూరేవిధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.చెక్కులు పొందిన వారిలో మంద మహేందర్, సర్దార్ని దర్శన్ కౌర్,ఆస్మా సుల్తానా,మహమ్మద్ యూసుఫ్,షమీనాబేగం, గాజుల తిరుపతి తదితరులుఉన్నారు.