calender_icon.png 23 July, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

22-07-2025 11:03:58 PM

ఖమ్మం (విజయక్రాంతి): సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామం నుండి 100 మంది టిఆర్ఎస్ పార్టీ నుంచి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Dr. Matta Ragamayee Dayanand) సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మీరందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పేదల పక్షాన నిలబడే పార్టీ అన్నారు. చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి సత్తుపల్లి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివా వేణు,సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, నాయకులు చల్లగుల్ల నరసింహ రావు, కమల్ పాషా, సిద్దారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.