18-01-2026 07:03:37 PM
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో గల సమ్మక్క–సారలమ్మలను అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు పోతుగంటి సుజాత రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు ఒడి బియ్యం పోసి, తల్లులకు చీరలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ వారు సాదరంగా ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట మోహన్ స్వప్న, బొల్లం లింగమూర్తి, రిటైర్డ్ ఎస్సై సాగర్, కొండూరి అనిల్, భాస్కర్ రావు, మోహన్ రావు, రవీందర్ పాల్గొన్నారు.