18-01-2026 07:01:26 PM
చిట్యాల,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో బిజెపి శ్రేణులు విజయం కోసం సర్వసన్నద్ధంగా ఉండాలని చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపాలిటీలో బిజెపి పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా 5 వార్డ్ లో ఈడుదల మల్లేష్ ఆధ్వర్యంలో గడప గడప కి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ మాట్లాడుతూ.... గత 11 ఏళ్లుగా బిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు మోసపోతూనే ఉన్నారు.
ముఖ్యంగా మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రం మంజూరు చేస్తున్న ‘అమృత్’, ‘స్వచ్ఛ భారత్’ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని, మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల నిధులతో, రాష్ట్రాన్ని ఆదుకుంటుంటే.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో బిజెపి శ్రేణులు విజయం కోసం సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పరిమితి స్థానాల్లో పోటీ చేసి విజయాలు సాధించామని, అదే విధంగా రానున్న మున్సిపల్ ఎన్నికలలో బిజెపి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కంభాలపల్లి సతీష్, బీజేపీ బీజేపీ సీనియర్ నాయకులు పల్లె వెంకన్న గౌడ్, జిల్లా కౌన్సిల్ మెoబర్ కూరెళ్ల శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకులు జయరాపు రామకృష్ణ,నీలం మధు, నీలం నరేష్, పాల రవి వర్మ, బెల్లి నరేష్,కన్నె బోయన మురళి, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.