కాపలాదారుడిగా సుఖ్‌బీర్ సింగ్!
* స్వర్ణదేవాలయంలో శిక్ష అనుభవించిన పంజాబ్ మాజీ సీఎం
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు అకాల్ తఖ్త్ పలు శిక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన అమృత్‌సర్‌లోని స్వర్ణదే వాలయంలో సేవాదార్ (కాపలాదారుడు)గా శిక్ష అనుభవించారు. వీల్‌చైర్‌లో స్వర్ణ దేవాలయానికి వచ్చిన సుఖ్‌బీర్ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మెడలో పలక, చేతిలో ఈటెను పట్టుకొని సేవాదర్ శిక్ష అనుభవించారు.
పార్టీ సీనియర్ లీడర్ బిక్రమ్ సింగ్ మజీతియా సైతం శిక్షను అనుభవించారు. పార్టీ నాయకులతో కలిసి దేవాలయంలోని పాత్రలను కడిగారు. తర్వాత బాత్‌రూమ్‌లను శుభ్రం చేశారు. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అధికా రంలోఉన్నప్పుడు బాదల్ మతపరమైన తప్పిదాలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
వీటికి అకాల్ తఖ్త్ బాదల్‌ను బాధ్యున్ని చేసింది. స్వర్ణ దేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు గతంలో ఇచ్చిన బిరుదును కూడా ఉపసంహరించుకుంది.






